ఆర్టీసీ బస్సును ఢీకొని మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దుర్మరణం.. సెల్ఫీ దిగుతూ యువకుడి ఫోజులు

Update: 2019-11-26 09:14 GMT

హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్ నెంబర్ 12లో ఆర్టీసీ బస్సు ఢీకొట్టి ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతిచెందారు. టాటా కన్సెల్టెన్సీలో పనిచేస్తున్న సోహినీ సక్సేనా ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. తాత్కాలిక బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ ను దించి చితకబాదారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఓవైపు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ నిండు ప్రాణం పోతే... కొందరి పైత్యం పరాకాష్టకు చేరింది. ప్రమాదఘటనతో పాటు.. మహిళ మృతదేహం ఫ్రేమ్ లో వచ్చేలా సెల్ఫీ దిగుతూ ఓ యువకుడు ఫోజులు కొట్టాడు. ఏమాత్రం బాధ్యత లేకుండా... ఇలా యువత సెల్ఫీ పిచ్చిలో పడి కొట్టుకుపోతుందనడానికి ఇదే నిదర్శనం. సెల్ మాయలో పడి... మానవత్వం మంటగలుస్తుంది.

Similar News