వైఎస్సార్‌ కాపు నేస్తం పథకానికి ఆమోద ముద్ర

Update: 2019-11-27 08:18 GMT

ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో ప్రభుత్వం కాపు సామాజిక వర్గం మహిళలకు ఆర్థిక సాయం అందించనుంది. అటు.. టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచుతూ చట్టసవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వైఎస్‌ఆర్‌ నవశకం సర్వేపై చర్చించిన కేబినెట్.. దీని ద్వారా సంక్షేమ పథకాల్లో మరింత పారదర్శకత వస్తుందని అభిప్రాయపడింది. వివిధ సంక్షేమ పథకాలకు వేర్వేరుగా కార్డుల జారీకి సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. రేషన్‌ కార్డులు పొందేందుకు నిబంధనల్లో మార్పుపై కేబినెట్‌లో సమీక్ష నిర్వహించింది. ఆదాయం, భూమి, విద్యుత్ వినియోగం వంటి అంశాలకు సంబంధించి నిబంధనల్లో మార్పులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది.

Similar News