ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చీ బాధ్యతలు చేపట్టారు. డీజీపీ నియామాకంపై ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈయనే ఈ పదవిలో కొనసాగుతారని ఈసీ వెల్లడించింది. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు.
కాగా, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ ఆదివారం వేటువేసిన విషయం తెలిసిందే. తక్షణమే ఆయనను బదిలీ చేయాలని సీఎస్‌కు ఆదేశాలు జారీచేసింది. సోమవారం ఉదయం11 గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఆదేశించింది. వారిలో నుంచి ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అయిన బాగ్జీ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహించనున్నారు.