జనాల్ని రెచ్చగొట్టి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది: చంద్రబాబు

Update: 2019-11-28 07:20 GMT

రాష్ట్రంలో ప్రగతిని అడ్డుకోవడమే కాకుండా.. జనాల్ని రెచ్చగొట్టి ప్రభుత్వం పబ్బం గడుపుతుందని చంద్రబాబు ఆరోపించారు. హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేసి.. సంపద సృష్టించాలని భావిస్తే.. అమరావతిని మంత్రులు శ్మశానంతో పోలుస్తున్నారని మండిపడ్డారు. బూతులు మాట్లాడటం, ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా అరాచకపాలనకు తెరతీశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానికి విపక్ష పార్టీ నేతలు వస్తే.. అడ్డుకోవడం ఎక్కడా ఉండదన్నారు.

అటు అమరావతి ప్రజలు ఎవరి ట్రాప్ లోనో పడి.. భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చంద్రబాబు సూచించారు. అమరావతి భవిష్యత్తు సంపద అని.. మీ పిల్లల భవిష్యత్తు మీరే నాశనం చేసుకుంటారా అని ప్రశ్నించారు. రాజధాని వస్తే.. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని.. సంపద సృష్టిస్తుందన్నారు.

Similar News