నా మతం మానవత్వం: సీఎం జగన్

Update: 2019-12-02 08:11 GMT

ఇటీవల తన మతం, కులం గురించి విపక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు ఏపీ సీఎం జగన్‌. తన మతం మానవత్వమని, కులం మాట నిలబెట్టుకునే కులమని ఆయన పేర్కొన్నారు. విపక్షాలు తమ ప్రభుత్వం చేస్తున్న మంచి చూసి జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. గుంటూరులో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి.. జనవరి1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తామని తెలిపారు.

ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి రోజుకు 225 రూపాయలు లేదా నెలకు గరిష్టంగా 5వేలు ఈపథకం ద్వారా అందిస్తామని సీఎం తెలిపారు. ప్రభుత్వాసుపత్రులను ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతామన్నాని పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలనే ఆరాటంతో పనిచేస్తున్నామని చెప్పారు.

Similar News