జగన్ ఇంటి సమీపంలో 40 మందిని మత మార్పిడి చేశారు : పవన్ కళ్యాణ్

Update: 2019-12-04 09:20 GMT

బీజేపీకి తాను ఎప్పుడూ దూరంగా లేనన్నారు పవన్ కల్యాణ్. ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీతో విభేదించిన కారణంగానే మొన్నటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశామని గుర్తు చేశారు. అమిత్‌షా అంటే వైసీపీ వాళ్లకే భయమని.. తనకు గౌరవం ఉందని అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన పవన్.. YCPపై మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు వైసీపీ వాళ్లే నాతో సంప్రదింపులు జరిపారని అన్నారు.

మత మార్పిడుల అంశంపైనా పవన్ తీవ్రంగా స్పందించారు.. జగన్ ఇంటి సమీపంలో 40 మందిని మత మార్పిడి చేస్తే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న మతమార్పిడిలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. తిరుమల వెళ్లి జీసస్ అనకూడదని అన్నారు. ధర్మ పరిరక్షణ కోసం తాను ఎంత వరకైనా వెళ్తానన్నారు.

Similar News