హైదరాబాద్ గోల్కొండ పరిధిలో వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తూ.. వారి నుంచి నగదు, సెల్‌ఫోన్లు దోచుకుంటున్న ఆరుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, రెండు వేల నగదు రికవరీ చేశారు. నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు రిఫర్ చేశారు.
ఈనెల 2న నలుగురు యువకులు మద్యం సేవించి.. అర్థరాత్రి ఒంటరిగా వెళ్తున్న వాహన దారుడిపై దాడి చేశారు. ఆదే సమయంలో ఆప్రాంతంలో ఉన్న లారీ డ్రైవర్ వారిని అడ్డుకోవడంతో అక్కడ నుంచి పారిపోయి.. మరో ఇద్దరితో వెంట తీసుకోచ్చి వారిపై దాడి చేసి నగదును దోచుకెళ్లారని వెస్ట్ జోన్ డిసిపి శ్రీనివాస్ తెలిపారు. నిందితులపై గతంలో కూడా ఇతర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు గుర్తించినట్లు వెల్లడించారు.