చిత్తూరు జిల్లా మదనపల్లెలో రాప్తాడు జనసేన కార్యకర్త సాకే పవన్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాడు. అధినేత ఆదేశిస్తే వైసీపీ నేతల తలలు నరికి తెస్తానన్నాడు. దీంతో ఒక్కసారిగా సమావేశంలో చర్చ మొదలైంది. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అక్రమ కేసుల పేరుతో పవన్ కమార్ ను వేధిస్తుండడంతోనే అధినేత ముందు తన బాధను చెప్పుకున్నారని సన్నిహితులు పేర్కొన్నారు.