మహారాష్ట్ర అవాస్ అఘాడిలో శివసేన పట్టు కొల్పోతోందా? కూటమిలో నిర్ణయాధికారానికి బదులు.. నిర్ణయాలు పాటించే స్టేజ్ కి దిగజారుతోందా? మంత్రుల పంపకాల లెక్కలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. కూటమిలో ఎన్సీపీ మంత్రాంగం ముందు శివసేన సైలెంట్ అవ్వాల్సి వస్తోంది. అందుకే ఎన్సీపీ కంటే తక్కువ మంత్రి పదవులతో అడ్జెస్ట్ అవుతోంది శివసేన.
మహారాష్ట్రలో శివసేనకు ఓ బ్రాండ్ ఉండేది. సీఎం కుర్చీలో లేకున్నా.. పక్కన ఉండి ప్రభుత్వాన్ని చెప్పుచేతల్లో నడిపించుకునేది. సేన అంటే ఓ శాసనం. సేన వన్స్ డిసైడ్ అయితే మిగిలిన వాళ్లు కూడా ఫాలో అవ్వాల్సి వచ్చేది. అలా పాటించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఎందుకో తీరు మారుతున్నట్లు కనిపిస్తోంది. సేన రాజకీయాలు బాల్ థాక్రే తరం నుంచి ఉద్ధవ్ థాక్రే తరానికి చేరుకున్నాయి. తరంతో పాటు పార్టీ తీరు కూడా మారుతోంది.
మహారాష్ట్ర అవాస్ అఘాడీ. బీజేపీపై పంతం నెగ్గించుకునేందుకు దశాబ్దాల సిద్ధాంతాలను పక్కన పెట్టింది శివసేన. భిన్న భావాలు ఉన్న కాంగ్రెస్ తో దోస్తీ కట్టింది. హిందుత్వపై పట్టు కొల్పోయే ప్రమాదంలో పడింది. మహారాష్ట్ర రాజకీయాలు క్రమంగా ఎన్సీపీ కేంద్రంగా మారుతున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్ర రాజకీయాల్లో శివసేనది పైచేయిగా ఉండేది. తాజాగా ఎన్సీపీ మాటే చెల్లుబాటు అవుతోంది. ఇక ఇప్పుడు కాంగ్రెస్, శివసేన మధ్య ఎన్సీపీ కింగ్ మేకర్ గా ఎదుగుతోంది. ఎంతలా అంటే సంకీర్ణ కూటమిలో మంత్రి పదవులను శాసించే అంతగా ఎన్సీపీ డామినేషన్ పెరిగిపోయింది.
ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మంత్రివర్గ విస్తరణ జరగాల్సి సమయం ఆసన్నమవుతోంది. దీంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. తొలుత శివసేనకు ఎక్కువ మంత్రిపదవులు దక్కుతాయని ప్రచారం జరిగింది. కానీ, పవార్ మంత్రాంగం ఫలించి ఆయన పార్టీకి 16 మంత్రి పదవులు ఇచ్చేందుకు శివసేన, కాంగ్రెస్ అంగీకరించాల్సి వచ్చినట్లు సమాచారం. శివసేన 14 మంత్రిపదవులతో సరిపుచ్చుకోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి 13 మంత్రి పదవులు దక్కనున్నాయి. మంత్రివర్గంలో ఎక్కువ సీట్లు చేజిక్కించుకోబోతున్న ఎన్సీపీ.. పోర్ట్ పోలియోల్లోనూ పై చెయ్యి సాధించే అవకాశాలు లేకపోలేదు. సీఎం పదవి దక్కించుకున్న శివసేన..ఇప్పుడా కుర్చి దక్కించుకునేందుకు అన్నింటిని త్యాగం చేయాల్సి వస్తోంది. చివరి పార్టీ సోల్ ను కూడా