సన్నబియ్యం ఇస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం.. ఆ హామీని ఎందుకు అమలు చేయలేక పోతోందని ప్రశ్నించారు టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు. చివరికి సన్నబియ్య ఇవ్వడం లేదని, కేవలం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేస్తామని మాట మార్చారని సభలో లేవనెత్తారు. ఇచ్చిన మాట ఎందుకు తప్పుతున్నారని ప్రశ్నించారాయన. ప్రతి తెల్లరేషన్ కార్డు దారుడికి సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు అచ్చెన్నాయుడు.