ఉల్లిపై జరుగుతున్న రాజకీయాలు బాధ కల్గిస్తున్నాయన్నారు సీఎం జగన్. అసెంబ్లీలో ఉల్లి ధరలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనట్లు.. ఏపీలోనే అతి తక్కువ ధరకు ఉల్లి అందిస్తున్నట్లు సీఎం చెప్పారు. తక్కువ ధరకు ఉల్లి అందిస్తున్నందునే ప్రజలు క్యూలు కడుతున్నారన్నారు.
అలాగే ఉల్లిపాయల ధరల నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నామన్నారు మంత్రి మోపిదేవి వెంకటరమణ. ఉల్లిధరలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడిన మంత్రి మోపిదేవి.. కిలో ఉల్లి 25 రూపాయలకే సరఫరా చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని అధిక ధరలకు కొనుగోలు చేసి... రైతు బజార్ల ద్వారా అందిస్తున్నామన్నారు మంత్రి.