ఓ రైతు వద్ద వీఆర్వో తీసుకున్న లంచం సొమ్మును కలెక్టర్ వాపస్ ఇప్పించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. భూమి పట్టా కోసం రైతు వద్ద వీఆర్వో రమేష్‌రెడ్డి రూ. పదివేలు లంచంను తీసుకున్నాడు. డబ్బు ఇచ్చినా వీఆర్వో పని చేయడం లేదని ఆ రైతు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. దీంతో కలెక్టర్ శరత్.. వీఆర్వోను పిలిచి విచారణ జరిపారు. లంచం సొమ్ము వాపస్ ఇప్పించి వీఆర్వో, వీఆర్‌ఏలను సస్పెండ్ చేశారు కలెక్టర్. లంచం ఇవ్వడం, లంచం డిమాండ్ చేయడం నేరమని.. లంచం అడిగితే ఏసీబీకి ఫిర్యాదు చేయాలన్నారు కలెక్టర్.