ఏపీ అసెంబ్లీకి నిరసనగా వచ్చిన టీడీపీ సభ్యుల పట్ల.. అసెంబ్లీ మార్షల్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వెంట తెచ్చుకున్న బ్యాగులను సైతం పరిశీలించారు. మార్షల్స్ తీరుపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. సభ్యులను అగౌరవ పరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిధి దాటి ప్రవర్తిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.