ఏపీ దిశా చట్టం-2019 అభినందనీయం: చిరంజీవి

Update: 2019-12-12 05:43 GMT

ఏపీ దిశా చట్టాన్ని అభినందిస్తూ మెగాస్టార్‌ చిరంజవి ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌ దిశా చట్టం-2019 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. ముఖ్యంగా మహిళలు, లైంగిక వేధింపులకు గురువుతున్న చిన్నారులకు ఈ చట్టం భరోసా, భద్రత ఇస్తుందన్న ఆశ తనలో ఉందన్నారు. దిశ ఘటన అందరి జీవితాలను కలిచివేసిందన్న ఆయన.. ఆ ఎమోషన్స్‌ తక్షణ న్యాయాన్ని డిమాండ్‌ చేశాయన్నారు. తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాల్ని ఇస్తాయన్న నమ్మకం అందరిలో ఉందన్నారు.

సత్వర న్యాయం కోసం ఏపీలో తొలి అడుగులు పడటం హర్షణీయమన్నారు చిరంజీవీ. లైంగిక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు విధించడం ద్వారా నేరాలోచన ఉన్న వాళ్లలో భయం కల్పించేలా చట్టాలు తేవడాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నామన్నారు. ఈ చర్యలతో మహిళా లోకం నిర్భయంగా, స్వేచ్చగా ఉండగలుగుతుందన్న నమ్మకం తనలో ఉందన్నారు చిరంజవీ.

Similar News