టిక్‌టాక్ మోజులో ఓ ఇళ్లాలు ఘనకార్యం చేసింది. టిక్‌టాక్ మాయలోపడి ఇద్దరు పిల్లలతో కలిసి పరారైంది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అర్చన.. గత కొంతకాలంగా టిక్‌టిక్ చేస్తుంది. అయితే అర్చనకు.. టిక్‌టాక్‌లో బెంగళూరుకు చెందిన అంజలి అనే మహిళతో పరిచయం ఏర్పడింది.
పురుషుడి వేషంలో బెంగళూరుకు చెందిన మహిళ టిక్‌టాక్ లు చేస్తుండేది. ఇద్దరు పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. దీంతో 3రోజుల క్రితం వివాహిత మహిళ అర్చన ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి.. బెంగళూరుకు చెందిన అంజలితో కలిసి పరారైంది. ఈ ఘటనపై అర్చన తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశారు.