పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం, కేంద్రీయ వర్సిటీల్లో ఆందోళనలు జరిగాయి. అర్ధరాత్రి ఉర్దూ యూనివర్సిటీలో విద్యార్ధులు ప్రధాన గేటు వద్దకు వచ్చి నిరసన తెలిపారు. ఢిల్లీలో జరిగిన లాఠీఛార్జ్‌లను ఖండించారు. డప్పులు వాయిస్తూ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.