ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని ఆశపడ్డా: చంద్రబాబు

Update: 2019-12-17 13:14 GMT

 

ప్రపంచ స్థాయి రాజధాని నగరం కావాలని తాను ఆశపడ్డానని.. అందుకే సింగపూర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నానని చంద్రబాబు వివరణ ఇచ్చారు. రాష్ట్ర విభజన తరువాత రాజధాని కోల్పోయామనే ఆవేదన అందరిలో ఉండేదని.. రాజధాని ద్వారా రాష్ట్రానికి సంపద సృష్టించాలనే ఉద్దేశంతో అమరావతిని ఏర్పాటు చేశామన్నారు చంద్రబాబు.

రాజధాని అన్నది ఉపాధి కేంద్రంగా ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 13 జిల్లాలకు అందుబాటులో ఉంటుందనే కారణంతోనే అమరావతిని ఎంచుకోవడం జరిగిందన్నారు. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు రాజధాని ముంపుకు గురయ్యే అవకాశం లేదన్నారు.

సింగపూర్‌కు ప్రపంచంలోనే ఒక గౌరవప్రదం ఉందన్నారు చంద్రబాబు. సంపద సృష్టిస్తారని చెప్పబట్టే సింగపూర్‌తో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది అన్నారు. కావాలనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News