శ్రీకాకుళం జిల్లా నౌపాడ గ్రామంలో దారుణం జరిగింది. చెల్లెలు వరుసైన బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడో కమాంధుడు. నౌపాడకు చెందిన సంతోష్.. అదే గ్రామానికి చెందిన 8వ తరగతి బాలికను మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడటంతో పాటు అశ్లీల దృశ్యాలు కూడా చిత్రీకరించాడు. ఆ వీడియోలు విదేశాల్లో ఉంటున్న బాలిక తండ్రికి పంపి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు సంతోష్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.