సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌తో తనకు సాన్నిహిత్యం ఉన్నప్పటి నుంచే జగన్ గురించి తెలుసన్నారు.. వైఎస్‌లో ఉన్న 10శాతం మంచిగుణాలు కూడా జగన్‌లో లేవని ఆయన అచ్చం రాజారెడ్డిలాంటివాడని అన్నాడు జేసీ. చంద్రబాబులో కూడా మార్పు రావాలని.. ఇప్పటికైనా..శాంతివచనాలు పక్కనబెట్టాలని సూచించారు జేసీ.