ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. పాలన ఏకీకృతంగానే సాగాలన్నదే తమ నినాదమన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. సీఎం జగన్ ప్రకటన రాజకీయ గందరగోళానికి దారి తీసిందన్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరావతి భూములు ఇచ్చిన రైతుల్ని ఏం చేస్తారని ప్రశ్నించారు. అమరావతిని ఎలా ఉంచుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ అనేవి ఒకే చోట ఉంటే పాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. రాజధాని నిర్ణయం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉండాలన్నారు.