తమిళ్ హీరో రాఘవ లారెన్స్.. నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాపర్‌గా వివిధ పాత్రలు పోషిస్తుంటాడు. సూపర్ స్టార్ రజనీకాంత్‌కి లారెన్స్ వీరాభిమాని. తాజాగా రజనీ నటించిన దర్బార్ చిత్రం ఆడియో ఫంక్షన్‌లో కమల్ హాసన్‌పై కామెంట్ చేశాడు. రజనీ కాంత్‌పై అభిమానంతో కమల్ సినిమా పోస్టర్స్‌పై పేడ కొట్టేవాడినని చెప్పుకొచ్చాడు. దాంతో ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కమల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే లారెన్స్ తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా తనను ట్రోల్ చేసిన వారికి వివరణ ఇచ్చుకున్నాడు.
చిన్నప్పటి నుంచి రజనీకి వీరాభిమానిని. అయితే ఇప్పుడు కమల్, రజనీలు ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడుస్తున్నారు. స్నేహ బంధం కన్నా గొప్పది ఏదీ కాదని నిరూపిస్తున్నారు. ఆ విషయం ఇప్పటికి నాకు అర్థమైంది. కమల్ హాసన్‌ని కలిసి మాట్లాడాడు. ఇకపై ఏ కార్యక్రమానికీ హాజరు కానని, ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయనని వెల్లడించాడు. అయితే రజనీకి సంబంధించిన ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాల్సి వస్తే ఆయన పర్మిషన్ తీసుకుని వస్తాననన్నాడు. ఈ నిర్ణయం వెనుక ఎన్నో కారణాలున్నాయి. అవన్నీ మీతో చెప్పలేను. రజనీ సార్ దీవెనల కన్నా నాకు ఏదీ ఎక్కువ కాదన్నాడు.