నేడు రాయచోటిలో పర్యటించనున్న సీఎం జగన్‌

Update: 2019-12-24 00:58 GMT

సీఎం జగన్‌ మంగళవారం కడప జిల్లా రాయచోటిలో పర్యటించనున్నారు. వంద పడకల ఆస్పత్రి, భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి, తాగునీటి పైప్‌లైన్లు వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి పులివెందుల చేరుకుంటారు. రేపు క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొని.. పులివెందులలో ఇండోర్‌ స్టేడియం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనంతరం తాడేపల్లి బయల్దేరి వెళ్లనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Similar News