జీఎన్ రావు కమిటీ నివేదికపై అమరావతి ప్రాంత రైతుల నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని కోసం తాతల కాలం నుంచి వస్తున్న భూములను ఇచ్చి త్యాగం చేస్తే మాకు ఇచ్చే బహుమానం ఇదా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు.