కర్నూలు జిల్లా ఆదోనిలో.. ఓ అమ్మాయి ప్రేమ కోసం విద్యార్ధులు కొట్టుకున్నారు. ఈ ఘటన సాయి జూనియర్ కాలేజీలో జరిగింది. ఇదే కాలేజీలో చదువుతున్న ఇంటర్ సెకెండియర్ విద్యార్ధులు, డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్ధులు మధ్య గొడవ జరిగింది. కాలేజీ ఆవరణలోనే గొడవ పడి ఒకరునొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ కాలేజీ నుంచి బయటకు పరుగులు తీయడంతో తోటి విద్యార్ధులు భయాందోళనకు గురయ్యారు.
చివరికి పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. విద్యార్ధుల్ని స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇళ్లకు పంపించారు. అయితే.. ఈ గొడవపై మాట్లాడేందుకు సీఐ మహమ్మద్ గౌస్ నిరాకరించారు. ఆదోనిలో వివిధ కాలేజీల్లో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకుని... ఇలాంటి గొడవలు జరగకుండా చూడాలని కోరుతున్నారు విద్యార్దుల తల్లిదండ్రులు.