ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహారశైలిపై అఖిల భారత హిందూ మహాసభ తీవ్రస్థాయిలో ఫైరవుతోంది. సీఎం జగన్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు హిందూ మహాసభ అధ్యక్షులు చక్రపాణి మహరాజ్ సిద్ధమవుతున్నారు. జనవరి మొదటి వారంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగబోతున్నారాయన. అయోధ్య టు అమరావతి అంటున్నారు.
జనవరిలో అయోధ్య నుంచి 20 వేల మంది హిందువులతో అమరావతికి వస్తామని చక్రపాణి మహరాజ్ చెప్తున్నారు. హైందవ ప్రాశస్త్యం కలిగిన నగరాలను అణగదొక్కాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అందులో భాగంగానే రాజధాని అమరావతిని తరలించాలని కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపణ. అయోధ్య నుంచి అమరావతికి వచ్చి.. రాజధానికి భూములిచ్చిన రైతులకు సంఘీభావం తెలపనున్నారు.
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని పోరాటం చేస్తున్న రైతులకు అనూహ్య మద్దతు లభించినట్టయింది. అఖిల భారత మహాసభ సైతం అమరావతి రాజధాని కోసం ప్రత్యక్ష పోరాాటానికి సిద్ధమైంది. జనవరి మొదటివారంలో 20 వేల మంది హిందువులతో మహాసభ అధ్యక్షులు చక్రపాణి మహరాజ్ అయోధ్య నుంచి బయల్దేరి అమరావతికి రాబోతున్నారు.