GN రావు కమిటీ నివేదికపై ఏపీ కేబినెట్‌లో చర్చ జరుగునున్న తరుణంలో విశాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది . ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నిర్ణయంపై చర్చించేందుకు విశాఖ టీడీపీ నేతలు నగరంలోని ఓ స్టార్ హోటల్లో సమావేశమైయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి, వాసుపల్లి గణేష్ , గణబాబులతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను స్వాగతించారు. అదే సమయంలో అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల భవిష్యత్తు పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తీర్మానం చేశారు. తమ అభిప్రాయాన్ని అధిష్టానానికి నివేదిస్తామని తెలిపారు. విశాఖ వాసులుగా ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను స్వాగతించాల్సిన బాధ్యత తమపై ఉందని టీడీపీ నేతలు పేర్కొన్నారు.