ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హౌస్‌ అరెస్ట్‌

Update: 2019-12-26 06:34 GMT

అమరావతికి వచ్చే టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నానితో పాటు ఎమ్మెల్సీ బుద్దావెంకన్నను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. తమను హౌస్‌ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. టీడీపీ నేతల గృహనిర్బంధంతో పలు చోటు ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.

గంటూరు జిల్లా పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో టీడీపీ నేతలు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీస్‌ యాక్ట్‌ 30, 144 సెక్షన్‌ అమలులో ఉన్నందును నిరసన ర్యాలీలకు అనుమతి లేదన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ర్యాలీ చేసి తీరుతామన్నారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర.

Similar News