పళ్లెంలో పసుపు నీరు పోసీ రోకలిని నిలబెట్టారు

Update: 2019-12-26 05:32 GMT

గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పురాతన ఆచారాలు, నమ్మకాలు కొనసాగుతూనేవున్నాయి. ముఖ్యంగా సూర్యగ్రహణం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సూర్యగ్రహణం సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కృష్ణపల్లిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తాడ్డి మంగమ్మ అనే మహిళ.. తమ ఇంటి వద్ద కంచు పళ్లెంలో పసుపు నీరు పోసీ రోకలి నిలబెట్టారు. గ్రహణం వీడేంతవరకు ఎలాంటి ఆధారం లేకుండా రోకలి నిలబడుతుందని వారి నమ్మకం. దీనిని చూడటానికి గ్రామంలో మహిళలు పెద్దయెత్తున తరలివస్తున్నారు.

Similar News