అమరావతిలో ఆగని నిరసనలు.. పలువురు రైతుల అరెస్ట్

Update: 2019-12-29 10:50 GMT

అమరావతిలో ఆందోళనలు 12వ రోజుకి చేరాయి. తుళ్లూరు, మందడం ప్రాంతాల్లో మహాధర్నాలు, వెలగపూడిలో రిలే నిరాహాదదీక్షలు కొనసాగుతున్నాయి. రైతులు, రైతు కూలీలు, మహిళలు దీక్షా శిబిరాల్లో పాల్గొంటున్నారు. 3 రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు..

అటు అమరావతిలో రైతుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించడం కలకం రేపుతోంది. రాజధాని గ్రామాలకు చెందిన ఏడుగురు రైతులను అరెస్టు చేశారు. వివిధ కేసులపై వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వెంకటపాలెం గ్రామానికి చెందిన ముగ్గురిని, మల్కాపురం నుంచి ఇద్దరిని, వెలగపూడి, నెక్కళ్లు గ్రామాల నుంచి ఒక్కో రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున తెనాలి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో.. వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.

ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని రైతులు మండిపడ్డారు. అర్ధరాత్రి దాటాక తమ ఇళ్లలో తనిఖీలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు..అరెస్టు చేసిన వారిని వెంటనే విడిచిపెట్టకపోతే పోలీస్‌ స్టేషన్ల ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Similar News