తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ ఖాకీ వార్ కొనసాగుతోంది.. ఫ్లాగ్ మార్చ్‌కు అనుమతివ్వకపోవడంపై పోలీసుల తీరును తప్పు పడుతున్నారు హస్తం నేతలు. సీపీ అంజనీకుమార్‌పై గవర్నర్‌కు కంప్లయింట్ చేసేందుకు సిద్ధమయ్యారు. సోమవారం గవర్నర్ తమిళిసైతో భేటీ కానున్న హస్తం నేతలు.. నగర పోలీస్ కమిషనర్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ చొరవచూపాలని కోరనున్నారు.
శనివారం సత్యాగ్రహ దీక్ష సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీకి సిద్ధమైన నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసు కమిషనర్ బాధ్యతా రహితంగా ప్రవర్తించారంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. సత్యగ్రహ దీక్ష చేస్తోన్న కాంగ్రెస్ కార్యకర్తల్ని అడ్డుకున్నారని విమర్శిస్తున్నారు. ఈ ఘటనకు కారకులైన పోలీస్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శాంతిభద్రతల అంశంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరనున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.