ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. MPTC, ZPTC ఎన్నికలకు ఈనెల 17న నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరి 15 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అలాగే పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ చేస్తే.. మార్చి 3వ తేదీ కల్లా పూర్తి చేయాలంది. ఎలక్షన్స్‌కు అడ్డంకులన్నీ తొలిగిపోయిన నేపథ్యంలో.. సంక్రాంతి తర్వాత ఒక్కసారిగా పొలిటికల్ వార్ డబుల్ అవబోతోంది.