ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్న అమరావతి రైతులు

Update: 2020-01-17 05:11 GMT

నిరసనలు, ర్యాలీలు, మహాధార్నాలతో రాజధాని ప్రాంతం దద్దరిల్లుతోంది. అమరావతి గ్రామాల రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం 31వ రోజుకు చేరింది. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు చలించలేదు. దీంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని అమరావతి పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. రాజధాని మహిళలు శుక్రవారం విజయవాడ దుర్మమ్మ సన్నిధి వరకు ర్యాలీ నిర్వహించి నైవేద్యం పెట్టే అవకాశం ఉంది.

నిరసనల్లో భాగంగా మందడం, తుళ్లూరుల్లో మహా ధర్నాలు నిర్వహించనున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలీ దీక్షలు, మంగళగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. పాత మంగళగిరి సీతారామ కోవెల నుంచి జరిగే ఈ ర్యాలీలో మాజీ మంత్రి లోకేష్‌ పాల్గోనున్నారు.

మధ్యాహ్నం ఏపీ గవర్నర్‌ను కలవనున్నారు అమరావతి జేఏసీ నేతలు. రాజధాని మార్పు నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కు తగ్గేలా చొరవ తీసుకోవాలని గవర్నర్‌ను కోరనున్నారు. మహిళలపై పోలీసుల దాడులు, 144 సెక్షన్‌ అమలుపై ఫిర్యాదు చేయనున్నారు. విజయవాడలో మహిళల ర్యాలీని అడ్డుకోవడం, పోలీస్‌ స్టేషన్‌లో నిర్భందించిన పరిణామాలను జేఏసీ నేతలు వివరించనున్నారు. రైత ఆందోళనలు, రాజధాని మార్పు వల్ల కలిగే నష్టం గవర్నర్‌కు వివరించనున్నారు.

Similar News