విశాఖలోనే సచివాలయం, రాజ్‌భవన్, హెచ్‌వోడీ కార్యాలయాలు : మంత్రి బుగ్గన

Update: 2020-01-20 18:14 GMT

ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖ, లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతి, జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలు ఉంటాయని మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రకటించారు. విశాఖలోనే సచివాలయం, రాజ్‌భవన్, హెచ్‌వోడీ కార్యాలయాలు ఉంటాయని చెప్పారు. అమరావతిలో చట్టసభలు, కర్నూలులో హైకోర్టుతోపాటు న్యాయపరమైన శాఖలన్నీ ఉంటాయని తెలిపారు.. అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన... ఇది చారిత్రాత్మకమైన బిల్లు అని చెప్పారు...

రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ ఆవశ్యకం అన్న మంత్రి..పరిపాలనను వికేంద్రీకరించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం అన్నారు..అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మూడు నుంచి నాలుగు జిల్లాలకో అభివృద్ధి మండలి ఉంటుందని తెలిపారు..13 జిల్లాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Similar News