ఉద్దండరాయునిపాలెంలో యాగం.. పెద్ద ఎత్తున హాజరైన రాజధాని ప్రజలు

Update: 2020-01-26 17:07 GMT

మూడు రాజధానుల పేరుతో తమకు అన్యాయం చేయొద్దంటూ వేడుకుంటున్నారు అమరావతికి భూములిచ్చిన రైతులు. 40 రోజులుగా వారి ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని 29 గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ప్రభుత్వాన్ని వేడుకుంటూనే.. పాలకుల మనసు మార్చాలంటూ దేవుళ్లకు మొక్కుతున్నారు. అటు.. రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ శివస్వామి ఆధ్వర్యంలో తలపెట్టిన యాగం 9 రోజులుగా కొనసాగింది. ఉద్దండరాయునిపాలెంలో మోదీ శంకుస్థాపన చేసిన చోట ఈ యాగం జరిగింది. ఆదివారం పూర్ణాహుతితో ఈ యాగం ముగుస్తోంది. పూర్ణాహుతికి 29 గ్రామాల నుంచి రైతులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Similar News