ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న అమరావతి రైతులు

Update: 2020-02-01 13:22 GMT

అమరావతి రైతుల ఉద్యమం ఉధృతమైంది. రాజధాని తరలింపుపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్‌ చేస్తూ.. 29 గ్రామాలు చేస్తున్న ఈ మహో ఉద్యమం 46వ రోజుకు చేరుకుంది. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే దీక్షలు కొనసాగాయి. మందడంలో రైతుల 24 గంటల దీక్ష కొనసాగుతుంది. రాయపూడి, మల్కాపురం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రులో ఆందోళనలు తీవ్రమయ్యాయి. రాజధాని ఉద్యమంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్‌ సర్కార్‌ వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. అటు సర్కార్‌పై ఒత్తిడి పెరిగేలా.. ఆందోళనను మరింత ఉధృతం చేయాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా.. ఫిబ్రవరి 7న విజయవాడలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Similar News