కేంద్రం ప్రకటించిన వీఆర్ఎస్‌కు BSNL ఉద్యోగుల నుండి భారీ స్పందన వచ్చింది. తెలంగాణలో BSNL సంస్థలో 4900 మంది స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. VRS తీసుకున్న ఉద్యోగుల్ని నాంపల్లి BSNL ఆఫీస్‌లో సన్మానించారు అధికారులు. దేశవ్యాప్తంగా లక్షా 69 వేల మంది BSNL ఉద్యోగులుండగా.. ఇందులో ఇందులో 78 వేల మంది వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇందులో 8060 ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తుండగా.. సగం మంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. మరో 10ఏళ్ల వరకు VRSకు అవకాశం ఉండకపోవడంతో పెద్ద సంఖ్యలో వీఆర్‌ఎస్ తీసుకున్నారు బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు.