శానసమండలి రద్దు ఏకపక్ష చర్య: ఎమ్మెల్సీ మాధవ్

Update: 2020-02-06 20:24 GMT

శానసమండలి రద్దు ఏకపక్ష చర్య అని అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. ఈ విషయంలో సీఎం జగన్ పునరాలోచించాలని సూచించారు. రాజధాని బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లినా ఆమోదం పొందుతాయన్నారు. మండలిలో వివిధ అంశాలపై ప్రజాస్వామ్యయుతంగా చర్చలు జరుగుతాయని.. అలాంటి వ్యవస్థను రద్దు చేయవద్దని కోరారు. మరోవైపు వార్షిక బడ్జెట్ లో కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందనడం సరికాదన్నారు. గతేడాది 60 వేల కోట్లు వచ్చాయని.. ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపితే గ్రాంట్స్ వస్తాయని అన్నారు.

Similar News