సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలిపారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. తాను నాన్న అని గర్వంగా పిలిచే వ్యక్తి కేసీఆర్ అన్నారు. మీ ముందు చూపుతో, నిబద్ధతతో మాలో ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నామని తెలిపారు.
సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ దక్షతకు నిదర్శనమన్నారు. ఈ నేలకు కేసీఆరే శ్రీరామరక్ష అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కేసీఆర్ శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు హరీష్.