తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.. హైదరబాద్ జలవిహార్‌లో ఘనంగా జరిగాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈకార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు కేకతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సీనియర్‌నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
జలవిహార్ ప్రవేశ ద్వారా వద్దనే వి లవ్ కేసీఆర్ పేరుతో పెద్దపెద్ద లోగోనూ ఏర్పాటుచేశారు. అలాగే వేడుకల సందర్భంగా కళాకారుల ధూంధాం నిర్వహించారు. వేడుకలకు ముందు నగరంలోని అన్ని నియోజక వర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు. ఒక్కో నియోజక వర్గంల దాదాపు నాలుగు చోట్ల ఈ కార్యక్రమాన్నిపెద్దయెత్తున నిర్వహించనున్నారు.