డీమార్ట్‌లో విద్యార్థి మృతిపై అనుమానాలు

Update: 2020-02-18 08:39 GMT

హయత్ నగర్ శ్రీచైతన్య కాలేజ్‌లో ఇంటర్ చదువుతున్న విద్యార్ధి సతీష్ మృతిపై అనుమానాలు వ్యక్తమవతున్నాయి. ఆదివారం కావడంతో అవుటింగ్ కోసం కాలేజ్‌ హాస్టల్‌ నుంచి సతీష్‌ మధ్యాహ్నం 12.15 నిమిషాలకు బయటికి వచ్చాడు. మధ్యలోనే తన స్నేహితులు కలవడంతో.. కాసేపు అక్కడే తిరుగుతూ రాత్రి 9.30 నిమిషాల టైంలో వనస్థలిపురంలోని డీ మార్ట్‌కు వెళ్లాడు. 20 నిమిషాలపాటు తన ఫెండ్స్ తో సతీష్ మార్ట్‌లోనే ఉన్నాడు.

డీమార్ట్‌లో సతీష్‌ చాక్లేట్ దొంగలించాడనే అనుమానంతో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేస్తున్నక్రమంలోనే కుప్పకూలిపోయాడని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. చాక్లేట్ దొంగలించిన టెన్షన్లోనే షాక్‌తో కింద పడిపోయాడని చెబుతున్నారు. సతీష్‌తో పాటు ఉన్న మరో ముగ్గురు సతీష్ చాక్లెట్ దొంగలించింది నిజమంటున్నారు. సతీష్‌పై దాడి జరగలేదని అతడి ఫ్రెండ్స్‌ చెబుతున్నారు.

శ్రీచైతన్య కాలేజ్ నిర్లక్ష్యం కారణంగానే హాస్టల్లో ఉండాల్సిన సతీష్ బయటికి రావడంతో మార్ట్‌లో మృతి చెందాడని అరోపిస్తున్నారు సతీష్ పేరెంట్స్. తమ కుమారుడి మృతికి పరోక్షంగా కాలేజ్ యాజమాన్యం.. డీమార్ట్‌ సిబ్బందే కారణమంటూ పోలీసులను ఆశ్రయించారు.

లంబాడీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో వనస్థలిపురం డీమార్ట్‌ దగ్గర ఆందోళనకు దిగారు. అగ్రహించిన కుటుంబ సభ్యులు లాంబాడీ కార్యకర్తలు ఫర్నీచర్ ధ్వంసం చేశారు. డీమార్ట్ నుంచి కాలేజ్ హాస్టల్ వరకు ర్యాలీగా చేరుకుని కాలేజ్ ముందు రొడ్డుపై బయటాయించి ఆందోళన చేశారు.

పర్మిషన్‌తోనే సతీష్‌ను అవుటింగ్‌కు బయటికి పంపామని.. గార్డియన్‌తో ఫోన్‌లో మాట్లాడించిన ప్రాసెస్ అంతా చేసిన తరువాతనే కాలేజ్ హాస్టల్ నుంచి బయటికి పంపామని కాలేజ్ యాజమాన్యం చెబుతోంది. గార్డియన్‌కు సమాచారం లేదని సతీష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

స్టూడెంట్ సతీష్ వ్యవహారంలో భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సతీష్‌తో మార్టులో ఉన్న విద్యార్ధుల స్టేట్మెంట్. కాలేజ్ సిబ్బంది.. డీమార్ట్ స్టాఫ్.. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేస్తున్నారు.

Similar News