బీసీ వర్గాలు అంటే వైసీపీకి చిన్నచూపు : టీడీపీ నేత బండారు

Update: 2020-02-23 11:52 GMT

బీసీ వర్గాలు అంటే వైసీపీకి చిన్నచూపు అని అన్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యానారాయణ. బీసీలను అన్ని విధాలా అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అచ్చెన్నాయుడిపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. అచ్చెన్నాయుడిని చూసి జగన్‌ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో బీసీలు ఎదగకుండా జగన్‌ ఓ వర్గానికి కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు బండారు సత్యనారాయణ.

Similar News

TG: యమ"పాశం"