మహబూబ్ నగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మెట్టుగడ్డ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బాయ్స్ కాలేజీ పార్కులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మన నగరాలను మనమే శుభ్రంగా వుంచుకోవాలని పిలుపునిచ్చారు కేటీఆర్. కౌన్సిలర్, వార్డు మెంబర్లు, శానిటేషన్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. తడి, పొడి చెత్తను వేరుచేసేలా ప్రజలను చైతన్య పరచాలని.. కౌన్సిలర్లే ఆ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. వార్డులవారీగా పట్టణ ప్రణాళికను రూపొందించాలని కోరారు.