జీవో కాపీలను తగలబెట్టి నిరసన తెలిపిన రైతులు

Update: 2020-02-25 17:03 GMT

అమరావతి రైతుల ఆందోళనలు పట్టించుకోని సర్కార్.. పేదల ఇళ్ల పట్టాలపై జీవో జారీ చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 54 వేల 307 మందికి లబ్దిదారులకు 1251.5 ఎకరాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడంలో భూముల్ని గుర్తించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రాజధాని రైతులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. తమ నిరసనలు పట్టించుకోకుండా ప్రభుత్వ దూకుడుగా ముందుకు వెళ్లడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిని విశాఖకు తరలించేస్తూ తామిచ్చిన భూములు పేదల ఇళ్ల పట్టాలకు ఎలా కేటాయిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.

మందడంలోని జీవో కాపీలను తగలబెట్టి రైతులు నిరసన తెలిపారు. రాజధాని భూములను పేదలకు ఇవ్వాలని నిర్ణయించి ప్రభుత్వం ఇచ్చిన జీవోపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు భూములు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. అమరావతి అభివృద్ధిని నాశనం చేయాలనే ప్రభుత్వం కుట్రను వ్యతిరేకిస్తున్నామంటున్నారు.

Similar News