కుప్పం ప్రజా చైతన్యయాత్రలో జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. పేదల అసైన్డ్ భూముల్ని లాక్కులని పంచుతున్నారంటూ విమర్శించారు. కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ పాలనపై గంపగుత్తగా సిట్ వేశారని, అందులో సిట్, స్టాండ్ అని వినే అధికారుల్ని నియమించారని ఎద్దేవా చేశారు చంద్రబాబు.