మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పూజారికి దేహశుద్ధి

Update: 2020-02-25 13:34 GMT

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి దేహశుద్ధి చేశారు మహిళలు. మంచిర్యాల జిల్లాకు చెందిన భక్తులు స్థానిక అంబేద్కర్‌ విగ్రహం దగ్గర బోనాలు చేస్తుండగా ఓ వ్యక్తి తప్పతాగి వచ్చి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని పట్టుకుని చితకబాదుతూ ప్రధాన ఆలయం వరకు తీసుకువచ్చారు. తాను రాజన్న ఆలయంలో పూజారిగా వ్యవహరిస్తున్నానని చెప్పడంతో.. ఆగ్రహం పట్టలేని మహిళలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Similar News