విజయనగరంలో పర్యటించనున్న చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి బొత్స. ప్రజా చైతన్య యాత్ర తర్వాత టీడీపీలో మిగిలిన ఒకరిద్దరు కూడ ఉండరని జోష్యం చెప్పారాయన. 2014కి ముందు విజయనగరం జిల్లాకు మెడికల్ కాలేజీ ఇస్తే... దాన్ని రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. పేదల కోసమే ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని, బలవంతంగా భూసమీకరణ చేయోద్దని సీఎం జగన్ చెప్పారన్నారు.