పట్టణ ప్రగతి అమలుపై.. జనగామ పట్టణంలో ఆకస్మిక పర్యటన చేపట్టారు మంత్రి కేటీఆర్. పట్టణ ప్రగతి కార్యక్రమం సందర్భంగా.. చేపడుతున్న పారిశుద్ధ్య వివరాలను ప్రజలను అడిగితెలుసుకున్నారు. జనగామలోని ధర్మకంచ బస్తీలో పర్యటిస్తున్న కేటీఆర్ స్థానికులతో మాట్లాడారు. పట్టణ ప్రగతిలో చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు కేటీఆర్. స్థానిక బస్తీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. జనగామలో మరిన్ని స్వచ్ఛవాహనాలను ఏర్పాటు చేయడంతోపాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్.