లారీని ఢీకొట్టిన తుఫాన్‌ వాహనం.. తొడి కోడళ్లు మృతి

Update: 2020-02-26 09:38 GMT

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రాచలంలో మొక్కు తీర్చేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నాగర్‌ కర్నూలు జిల్లా కోడు మండలం నరసయ్య పల్లి గ్రామా సర్పంచ్‌ కొమ్మసత్యనారాయణ కుటుంబం.. తుఫాన్‌ వాహనంలో వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. తొడి కోడళ్లు.. కొమ్మ శేషమ్మ, లక్ష్మమ్మ అక్కడిక్కడే చనిపోయారు. 8 మంది క్షతగాత్రులను..108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

Similar News