అమరావతిలో మహిళా రైతు మృతి

Update: 2020-02-28 14:47 GMT

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించేస్తారనే ఆందోళన రైతుల ఉసురు తీస్తోంది. 73 రోజులుగా ఉద్యమం చేస్తున్నా.. వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. దీంతో.. కొందరి గుండెలు అలసిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. శుక్రవారం ఎర్రబాలెంలో మరో మహిళా రైతు గుండె ఆగిపోయింది.

73 రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం మనసు మారకపోవడంతో 65 ఏళ్ల కోసూరు వీరమ్మ తీవ్ర మనస్థాపానికి గురైంది. రాజధాని కోసం తాను అర ఎకరం పొలం ఇచ్చానని.. అయినా ఇప్పుడు రోడ్డుపై పడాల్సి వచ్చిందని ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇంతలా తాము ఆందోళలనలు చేస్తున్నా ప్రభుత్వం మనసు మారకపోవడంతో తీవ్ర గుండెపోటుతో వీరమ్మ మృతి చెందారు.

Similar News