ఓ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న కన్నకూతురు మృతదేహంపై పడి రోదిస్తున్న తండ్రిని ఓ కానిస్టేబులో
కాలితో తన్నిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యవహారంలో సదరు కానిస్టేబుల్ పై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో శ్రీధర్ అనే కానిస్టేబుల్ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం.. అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.